హెడ్ కానిస్టేబుల్ లకు ఎస్ఐలుగా ప్రమోషన్స్

SMTV Desk 2019-01-17 12:43:44  Telangana state police department, Head constables get promotions to SI, IAS Anjani kumar

హైదరాబాద్, జనవరి 17: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న 10 మందికి ఎస్ఐలుగా పదోన్నతులు లభించాయి. బుధవారం పోలీసు కమీషనర్ అంజన్ కుమార్ ను తన కార్యలయంలో కలిసి తమ అధికార విధులపై చర్చించారు.

ఈ సందర్భంగా అంజన్ కుమార్ మాట్లాడుతూ పదోన్నతులు పొందిన వారు మరింత బాధ్యతగా పనిచేయాలని, పోలీసు శాఖ పేరు, ప్రతిష్టలను ఇనుమడింప చేయాలని కోరారు. విధి నిర్వహణలో కచ్చితంగా వుండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరాదని ఆయన కోరారు.