పార్టీ మార్పుపై స్పందించిన కాంగ్రెస్ శాసనసభ్యుడు

SMTV Desk 2019-01-12 17:16:05  Sudheer reddy MLA, Telangana Congress party, TRS

హైదరాబాద్, జనవరి 12: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని ఆరుగురు శాసనసభ్యులు తెరసలోకి వెళ్ళే అవకాశాలున్నాయని వస్తున్న వార్తలు ఈ రోజు వారందరూ తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చెయ్యడంతో ఆ వార్తలు కాస్త మరింత బలంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఉక్కిరి బిక్కిరి అయ్యింది. ఆ ఎమ్మెల్యేలు ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీఆర్ఎస్ పార్టీలోకి చేరిపోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వ్యాఖ్యలను ఎమ్మెల్యే డి.సుధీర్ రెడ్డి ఖండించారు. తాను టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని పార్టీ మారే ఛాన్సే లేదని చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో గందరగోళం సృష్టించి తమవైపుకు తిప్పుకునేందుకు టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతుందని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు.