పంచాయతీల ఏకగ్రీవంపై కోదండరాం వ్యతిరేఖత

SMTV Desk 2019-01-12 16:50:56  Prof Kodandaram, TJS, Telangana panchayat elections

హైదరాబాద్, జనవరి 12: తెలంగాణలో రానున్న పంచాయతి ఎన్నికల్లో ఏకగ్రీవం చేయడం పై టీజేఎస్ అధినేత ప్రో.కోదరండరాం వ్యతిరేఖంగా స్పందించారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ భారత్‌లో స్పీకర్‌ వ్యవస్థ మరింత పటిష్టంకావాలని పంచాయతీలను ఏకగ్రీవం చేయడం సరికాదని ఏకగ్రీవాలపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని ఆయన తెలిపారు.

ఎన్నికల్లో టిజెఎస్‌ తరపున నామినేషన్లు వేస్తున్నారని నేతలు దుస్తులు మార్చినంత తేలిగ్గా పార్టీలు మారుతున్నారని విమర్శించారు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఆయన సూచించారు. టీజేఎస్‌, కాంగ్రెస్‌లో విలీనం అవుతోందనేది నిజం కాదన్నారు.