చలానాలు ఎగ్గొట్టిన స్టార్ హీరోస్

SMTV Desk 2019-01-12 14:08:37  Telugu Star heroes cant follow traffic rules, Pawan kalyan, Mahesh babu, Balakrishna, Nithin, Sunil

హైదరాబాద్, జనవరి 12: సామాన్యులే కాదు సమాజంలో మంచి పేరు, గుర్తింపు వున్న టాలీవుడ్ అగ్ర హీరోలు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదు. వీళ్ళు ట్రాఫ్ఫిక్ రూల్స్ అతిక్రమించి చలనాలు కూడా చెల్లించకుండా ఎగ్గొట్టి తిరుగుతున్నారు. ట్రాఫిక్ చలానాలు ఎగ్గొట్టినవారిలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నితిన్, సునీల్ లాంటి వారు ఉన్నారు. వేగంగా వాహనం నడపటం, సిగ్నల్స్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్ లాంటి కేసుల్లో వీరి పేర్లు నమోదయ్యాయి. అయితే.. ఆ సమయంలో కారు స్టార్ హీరోలు నడిపి ఉండకపోవచ్చు.. వారి డ్రైవర్లు నడిపి ఉండొచ్చు.. కానీ ఫైన్ వేసినప్పుడు కట్టాల్సిన బాధ్యత మాత్రం కారు ఓనరు మీదే ఉంటుంది కదా.

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఏడు చలానాలకు రూ.8, 745 చెల్లించాలి. 2016 నుంచి ఈ చలనాలు పెండింగ్ లోనే ఉన్నాయి. హీరో, హిందూపురం ఎమ్మల్యే బాలకృష్ణ వొక చలానాకి డబ్బులు చెల్లించాల్సి ఉంది. గతేడాది 2018 మే నుంచి రూ.1,035 పెండింగ్ లో ఉన్నాయి. ఇక జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాహనంపై మూడు చలానాలకు గాను రూ.505 ఫైన్ విధించగా. 2016 నుంచి రుసుము చెల్లించలేదు. హీరో నితిన్ రెడ్డి రూ.1,035.. సునీల్ రూ.4,540లు ఫైన్ చెల్లించాల్సి ఉందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.