ఎంట్రెన్స్ పరీక్షలకు కన్వీనర్ లు : ఉన్నత విద్యామండలి

SMTV Desk 2019-01-11 20:35:32  Telangana state council of higher education, Convener, JNTU, MCET, ECET, ICET, LAWCET

హైదరాబాద్, జనవరి 11: రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా తెలంగాణ కామన్ ఎంట్రెన్స్ పరీక్షలకు కన్వీనర్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యూకేషన్ చైర్మెన్ ప్రోఫెసర్ టీ. పాపిరెడ్డి మీడియాకు తెలిపారు.

ఎంసెట్ కన్వీనర్ గా జె.ఎన్.టి.యు రిజిస్ట్రార్ యాదయ్య, ఈసెట్ కన్వీనర్ గా జె.ఎన్.టి.యు రెక్టార్ గోవర్ధన్ రెడ్డి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్ కన్వీనర్ గా కే యు ప్రొఫెసర్ సత్యనారాయణ, ఐసెట్ కన్వీనర్ గా కే యు ప్రొఫెసర్ రాజేశం, లాసెట్,పీజీ లా సెట్ కన్వీనర్ గా ఓయూ లా కాలేజ్ డీన్ జీబీ రెడ్డి, పీజీ ఈ సెట్ కన్వీనర్ గా ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ కుమార్, ఎడ్ సెట్ కన్వీనర్ గా ఓయూ ప్రొఫెసర్ మృణాళిని లను నియమించారు.