అప్ డేటెడ్ హరిదాసులు...

SMTV Desk 2019-01-10 13:10:02  Sankranthi festivel, Modern Haridasulu

హైదరాబాద్, జనవరి 10: సంక్రాంతి పండగ అనగానే అన్నింటికంటే ముందు గుర్తొచ్చేది గంగిరెద్దులు, హరిదాసులు. గంగిరెద్దులను ఇంటింటా తిప్పుతూ స్వచ్చమైన రామకీర్తనలు నోటితో ఆలపిస్తూ ఊరెగిస్తుండేవారు. అలాగే చేతిలో చిరుతలు, తలమీద అక్షయ పాత్ర, పంచకట్టు, పొడవైన జందెం, మూడు నామాలతో రామదాసు కీర్తనలు ఆలపిస్తూ ఇళ్ల ముందుకు వచ్చే హరిదాసులు అందరిని ఆకర్శిస్తుంటారు. అయితే ఇపుడు ఆ హరిదాసులు కాస్త అప్ డేట్ అయ్యి ద్విచెక్ర వాహనాలపై వొక టేప్ రికార్డు పెట్టుకొని ఊరేగుతున్నారు. కాలం మారే కొద్ది మనషులు కూడా మారతారన్న దానికి ఇది నిదర్శనంగా చెప్పవచ్చు.

ఇదివరకు హరిదాసులను చూడగానే స్వచ్చమైన తెలుగు నేల మీద ఉన్నామనే భావన కలుగుతుంది. తెలుగు లోగిళ్లలోకి అడుగు పెట్టిన హరిదాసులను తెలుగు గ్రుహిణులు కాడా సాదరాంగా ఆహ్వానిస్తూ వారికి పిండి వంటలతో, వస్త్రాలతో, ధనం, ధాన్యాలతో మర్యాద చేసి పంపిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. కాని ఇలాంటి ఆచార వ్యవహారాలు పూర్తిగా మారిపోయాయి. ఆదునీకతను సంతరించకున్న సమాజం హరిదాసుల జీవన విధానాన్ని కూడా మార్చేసింది.