క్రెడాయ్ ప్రాపర్టీ షో బ్రోచర్‌ ఆవిష్కరణ...

SMTV Desk 2019-01-09 12:04:26  Credai property show,ghmc, commissioner, Dana kishore

హైదరాబాద్, జనవరి 9‌: నగరంలోని హైటెక్స్‌లో క్రెడాయ్ ఆధ్వర్యంలో వచ్చే నెల 15 నుంచి 17 వరకు క్రెడాయ్ ప్రాపర్టీ ప్రదర్శించనున్నారు అని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్ ప్రకటించారు. ఈ సందర్భంగా క్రెడాయ్ ప్రాపర్టీ షో బ్రోచర్‌ను దాన కిశోర్ ఆవిష్కరించారు. మూడ్రోజుల్లో 70 నుంచి 75 వేల మంది క్రెడాయ్ ప్రాపర్టీ షోను సందర్శిస్తారని అంచనా.

ఈ సందర్భంలో భాగంగా దాన కిషోర్ మాట్లాడుతూ.. నగరవాసుల తాగునీటికి రూ. 4,500 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. రూ. 3 వేల కోట్లతో హైదరాబాద్‌లో మురుగునీటి వ్యవస్థ పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. అత్యంత ఆకర్షణీయమైన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామన్నారు.