పెన్షన్ తీసుకోవాలంటే వాటర్ ట్యాంక్ ఎక్కాలా?!

SMTV Desk 2017-07-27 18:04:49  PENTION, DIGITALIZATION, SINIOUR CITIZEN

వికారాబాద్, జూలై 27 : దాదాపు 60 ఏళ్ళ పైన ఉండే వయస్సు, ముసలితనం, దివ్యాంగులు ఇలాంటి వారు నడవడానికే ఇబ్బంది పడతారు. అలాంటిది పెన్షన్ ప్రక్రియను డిజిటలైజేషన్ చేసిన క్రమంలో వృద్దులతో పాటు, వికలాంగులు సైతం వాటర్ ట్యాంక్ ఎక్కి పెన్షన్ పొందాల్సి వస్తుంది. వివరాలలోకి వెళితే.. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలోని రాళ్లచిట్టంపల్లి గ్రామంలో పెన్షన్ తీసుకునే క్రమంలో ఆ గ్రామ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ శంకరయ్య ట్యాంకు పైన ఎక్కి కూర్చుంటే.. పెన్షన్ లబ్దిదారులు ఒక్కొక్కరు వెళ్లి బయోమెట్రిక్‌లో వేలి ముద్రలు నమోదు చేసుకుని ఫించన్‌ డబ్బులతో కిందకు దిగుతున్నారు. కాగా, బయోమెట్రిక్‌ తీసుకోవడానికి సిగ్నల్స్‌ సక్రమంగా లేకపోవడం వల్లే వాటర్‌ ట్యాంకు పైన కూర్చుని పింఛన్లు మంజూరు చేయాల్సి వస్తోందంటూ శంకరయ్య తెలిపారు.