రికార్డు స్తాయిలో మద్యం అమ్మకం ...!!!

SMTV Desk 2019-01-02 11:16:45  Telangana, Hyderabad, GHMC, New year celebrations, Liquor saling

హైదరాబాద్, జనవరి 2: కొత్త సంవత్సరం సందర్భంగా ఊహించని విధంగా రాష్ట్రానికి నిధులు పోగయ్యాయి. కేవలం మధ్యం కొనుగోలు వల్లనే అధికంగా వసూళ్లు రాబట్టడం ఇదే మొదటి సారి. డిసెంబర్ 31 వ తేది రాత్రి సమయంలో మద్యం దుకాణాల సమయం పెంచడంతో కేవలం హైదరాబాద్ నగరంలో రెండు గంటల్లోనే రూ. 70కోట్లు విలువచేసే మద్యం అమ్మకాలు జరిగాయి.

2017 డిసెంబర్ 31వ తేదీన రూ.60కోట్ల అమ్మకాలు జరగగా ఈ ఏడాది మరో రూ.10కోట్లు ఎక్కువగానే మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక మద్యం సేవించి పోలీసులకు చిక్కిన వారి సంఖ్య అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నగరంలోని చాలా ప్రాంతాల్లో మందుబాబులు డ్రంక్ డ్రైవ్ లో దొరికారు. చాలా చోట్ల మోతాదుకి మించి మద్యం సేవించిన కొందరు రోడ్లపై నానా రభస చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.