మోర్ సూపర్ మార్కెట్ కి జీహెచ్ఎంసీ షాక్

SMTV Desk 2018-12-28 19:50:55  Hyderabad, More super market, GHMC

హైదరాబాద్, డిసెంబర్ 28: నగరంలో ఎర్రమంజిల్ లోని మోర్ సూపర్ మార్కెట్ కి జీహెచ్ఎంసీ రూ.లక్ష జిరిమానా విధించింది. మోర్ సూపర్ మార్కెట్ నుంచి గత కొద్దిరోజులుగా భారీగా మురుగునీరు బయటకు వస్తోంది. దానిని గురువారం సెంట్రల్ జోన్ కమిషనర్ ముషారఫ్ ఫరూఖీ గమనించారు. దీంతో వెంటనే దీనిపై స్పందించిన ఆయన మోర్ సూపర్ మార్కెట్ కి రూ.లక్ష జరిమానా విధించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో పారిశుధ్యం గురించి మాట్లాడారు. పెద్దలుగా చెప్పుకొంటున్న చాలా మంది కాలనీల్లోని బంగ్లాలపై దృష్టి సారించనున్నామని జోనల్‌ కమిషనర్‌ ముషారఫ్‌ ఫారూఖీ తెలిపారు. ఇష్టానుసారంగా రోడ్లను ధ్వంసం చేసేందేందుకు కారణం అవుతున్నారని, దాని మరమ్మతుల ఖర్చు మొత్తం వారి నుంచే రాబట్టనున్నామన్నారు. కాలనీల్లో ప్రతి అపార్టుమెంటు వద్ద వొక్కో కుటుంబం రెండు మూడు కార్లు కడుగుతూ నీటిని రోడ్డున వదిలేస్తున్నారని, తరచూ బీటీ రోడ్లు దెబ్బతింటున్నాయన్నారు. వీరే కాకుండా ప్రభుత్వ సంస్థలనూ వదిలేది లేదన్నారు