వనుకుపుట్టిస్తున్న చైన్ స్నాచార్స్

SMTV Desk 2018-12-27 13:45:48  TS Police, LB Nagar, Hayat nagar, Vanasthalipuram, Chain snaching, Women, Crimes, Hyderbad city, GHMC circle

హైదరాబాద్, డిసెంబర్ 27: నగరంలో చైన్ స్నాచార్లు మరోసారి రెచ్చిపోయారు. 24 గంటల వ్యవధిలో 12 స్నాచింగ్ కేసులు నమోదు కాగా వొక్క ఎల్బీ నగర్ పరధిలోనే 7 స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాక హయత్ నగర్ పరిధిలో 2 చోట్ల స్నాచింగ్ లు జరిగాయి. ఇదే విధంగా వనస్తలిపురం పరిధిలో కూడా 2 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. స్నాచర్లకి వొంటరిగా వున్న మహిళలే టార్గెట్ అవుతున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం ఎల్బీ నగర్ కి చెందిన పద్మావతి అనే మహిళా మేడలోంచి నాలుగు తులాల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్ళారు. లక్ష్మమ్మ అనే మహిళ వొంటరిగా వెళ్లడాన్ని గమనించి ఆమె దగ్గరున్న నాలుగు తులాల చైన్ ను బైక్ పై నుండి వచ్చి లాక్కెళ్ళారు. ఈ పరిణామం హయత్ నగర్ లో పోలిస్ స్టేషన్ పరిధిలో జరగడం వల్ల ఆ ప్రాంత ప్రజలు భయాందోలనకు గురవుతున్నారు.

ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఈ వ్యవహారం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది.
చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి దుండగల కోసం గాలిస్తున్నారు. సీసీ కెమెరా రికార్డుల ఆధారంగా దొంగలను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. బయటికి వెళ్లే సమయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు సూచిస్తున్నారు