నగరంలో స్వల్పంగా తగ్గిన చలి తీవ్రత

SMTV Desk 2018-12-24 14:19:11  Hyderabad city, Weather report, Winter season, Tempareature leval down

హైదరాబాద్, డిసెంబర్ 24: నగరంలో చలి తీవ్రత స్వల్పంగా తగ్గుతుందని ఉదయం ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల వరకు చేరడంతో వాతారవణంలో మార్పులు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మూడు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు కొంత పెరుగుతుండడంతో చలిప్రభావం తగ్గుతూ వస్తుంది. నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారంణం కంటే 3-4 డిగ్రీలు అధికంగా నమోదవడంతో చలిగాలుల ప్రభావం కొంత తగ్గింది. మరో నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగుతాయని అధికారులు చెపుతున్నారు.