హై కోర్టులో పిటిషన్ దాఖలకు సిద్దమైన కాంగ్రెస్ చీఫ్

SMTV Desk 2018-12-22 18:53:11  Congress party, Uttam kumar reddy, MLC, MLA, TRS, High cort, Petitions

హైదరాబాద్,డిసెంబర్ 22: తమను టీఆర్ఎస్‌లో విలీనం చేయాల్సిందిగా ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్‌కు ఇచ్చిన లేఖని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా వ్యతిరేఖిస్తూ శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీలు శుక్రవారం నాడు శాసనమండలి ఛైర్మెన్ స్వామి గౌడ్ తో సమావేశం అయ్యి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఈ విషయమై కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. శుక్రవారం నాడు నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు తమను టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయాలని కోరుతూ శాసనమండలి ఛైర్మెన్‌కు లేఖను ఇచ్చారు. ఈ లేఖ ఆధారంగా శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షాన్ని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తూ శాసనమండలి సెక్రటరీ నర్సింహచార్యులు డిసెంబర్ 21వ తేదీ సాయంత్రం బులెటిన్ విడుదల చేశారు.

నిబంధనలకు విరుద్దంగా సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబడుతోంది. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయాలని మండలి ఛైర్మెన్ కు లేఖ రాయడాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మండలిలో విపక్షనాయుడు షబ్బీర్ అలీలు మండలి ఛైర్మెన్ కు వినతి పత్రం సమర్పించారు. గతంలో శాసనమండలిలో, అసెంబ్లీలో చోటు చేసుకొన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేసినట్టుగా గెజిట్ విడుదల చేసింది. ఈ పరిణామాలపై సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకొన్నారు. శాసనమండలి ఛైర్మెన్ తీసుకొన్న నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించి న్యాయం చేయాలని కోరనున్నారు. అయితే ఈ విషయమై హైకోర్టు ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందో చూడాలి