ఆడిటోరియం ప్రారభోత్సవంలో మహారాష్ట్ర గవర్నర్‌

SMTV Desk 2018-12-22 13:11:57  Maharastra Governar, vidyasagar rao, Prathima medical college aditoriam opening, Talasemia disease, Blood transpoting

కరీంనగర్, డిసెంబర్ 22: జిల్లాలోని ప్రతిమ మెడికల్ కళాశాల ఆడిటోరియం ప్రారభోత్సవంలో మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు పాల్గొనారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు తలసేమియా దేశాన్ని కృంగదీసే వ్యాధి అని అన్నారు. కేరళలోని ఆదివాసీలలో తలసేమియా అధికంగా ఉందని, తలసేమియా విషయంలో భారతావని అప్రమత్తం కావాలని అన్నారు. తలసేమియా బాధితులకు రక్తమార్పిడి కోసం 2 లక్షల యూనిట్లు అవసరమని తెలిపారు. బాధితులకు ఉచిత రక్తమార్పిడి చేసేందుకు ప్రయత్నించాలని అన్నారు. ప్రతి వొక్కరూ రక్తదానం చేయాలని గవర్నర్‌ విద్యాసాగర్‌రావు పిలుపునిచ్చారు.