ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

SMTV Desk 2018-12-21 19:14:42  Prabhas, Guest house , High court, Petition,

హైదరాబాద్, డిసెంబర్ 21: ప్రముఖ సంచలన సినీ నటుడు ప్రభాస్‌ కి చెందిన గెస్ట్‌హౌస్‌కు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటీషన్ పై వివరాలతో కూడిన కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఎలాంటి కూల్చివేతలు జరగకుండా యథాతధ స్థితిని కొనసాగించాలని పేర్కొంది. ప్రభుత్వం తరుఫున న్యాయవాది కోర్టు వివరణ ఇస్తూ కేవలం సీజ్‌ మాత్రమే చేశామని, ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని తెలిపారు. అయితే ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఈ పిటిషన్‌పై ఈ నెల 24న కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించి తదుపరి విచారణను డిసెంబర్ 31కి వాయిదా వేసింది