శ్రేష్ట చిట్‌ఫండ్ కంపెనీ మోసం

SMTV Desk 2018-12-21 15:40:30  Chit fund company fruads, Shreshta chitfund company, Khammam

ఖమ్మం, డిసెంబర్ 21: తెలంగాణ రాష్ట్రంలో మరో చిట్ ఫండ్ కంపెనీ ప్రజల చెవుల్లో పువ్వు పెట్టి మెల్లగా జారుకుంది. ఇదివరకు రిషబ్ చిట్‌ఫండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చిట్టీల పేరుతో రూ.200 కోట్లు వసూలు చేసిన ప్రజలను మోసం చేసిన సంగతి తెలిసిందే.
[ Famous comapany has cheating many people in the name of chit fund.]


అయితే తాజాగా ఖమ్మం జిల్లా వైరా కేంద్రంగా కొనసాగుతున్న శ్రేష్ట చిట్‌ఫండ్ కంపెనీ చిట్టీల పేరిట కోట్ల రూపాయలను వసూలు చేసి మోసానికి పాల్పడింది.

నాగబత్తిన క్రాంతికుమార్ వైరా మండలంలో గత కొన్నేళ్లుగా ఈ కంపెనీని నిర్వహిస్తున్నాడు. జనానికి బాగా నమ్మకం కుదిరాక తన అసలు రూపాన్ని చూపించాడు. జనం చెల్లించిన డబ్బు చెల్లించలేనంటూ రూ.4.58 కోట్లకు ఐపీ పెట్టాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.