హైదరాబాద్ , డిసెంబర్ 15: అదిరిందయ్యా కేటీఆర్… నిన్నే కొత్త పదవి… త్వరలో కొత్త ఇల్లు అన్నట్లు ఉంది ఆయన పరిస్థితి. నిన్ననే కేటీఆర్ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. బహుశా ఈసారి కేటీఆర్ మంత్రివర్గంలో ఉండరనే వార్తలు వస్తుంటే.. మరోవైపు ఆయన ఇల్లు కూడా మారుతున్నారనే వార్తలు వస్తున్నాయి.
పార్టీ కార్యకర్తలు, నాయకులకు అత్యంత పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా ఇల్లు కూడా మారాలని కేటీఆర్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయన సీఎం కేసీఆర్‌తోపాటు ప్రగతి భవన్లోనే నివాసముంటున్న సంగతి తెలిసిందే. అయితే, అక్కడ ప్రొటోకాల్ సమస్య కారణంగా కేసీఆర్, కేటీఆర్‌లను కలవలేకపోతున్నామన్న అసంతృప్తి కార్యకర్తల్లో ఉంది. దీనికితోడు, వారికి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ నిర్దేశించారు. ఈ నేపథ్యంలోనే, ఇల్లు మారాలనే ఆలోచన కేటీఆర్‌లో ఉందని అంటున్నారు. అయితే కేటీఆర్ కొత్త ఇల్లు ఎక్కడా అనే విషయంపై స్పష్టత రాలేదు.