ఇద్దరం కలిసి రాష్ట్రాభివృద్ధికి

SMTV Desk 2018-12-14 18:53:05  Harish Rao, KTR

హైదరాబాద్: ఇద్దరం కలిసి రాష్ట్రాభివృద్ధికి పని చేస్తామని హరీష్ రావు తెలిపారు. కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడంపై ఆయన్ను అభినందిస్తున్నాను. ఉదయాన్నే శుభాకాంక్షలు తెలియజేశానని హరీష్ తెలిపారు. దీనికి కేటీఆర్.. ‘‘థ్యాంక్యూ బావా అంటూ ట్విటర్ లో స్పందించారు. భవిష్యత్ లో కేటీఆర్ మరింత పేరు తెచ్చుకోవాలని, కేసీఆర్ కు ఆయన చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటున్నానని హరీష్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత బాగా పని చేయాలని కోరుకుంటున్నానన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పని చేశామని, రేపు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడంలో కూడా కలిసి పనిచేస్తామని హరీష్ అన్నారు.