భారీ ఆధిక్యంలో హరీశ్ రావు..

SMTV Desk 2018-12-11 11:00:26  harish rao,trs,

హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో హరీశ్ రావు దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తారని టీఆర్ఎస్ యువనేత కేటీఆర్ అన్న మాట నిజమే అవుతోంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిలబడిన హరీశ్ రావు తొలి రౌండ్‌లోనే భారీ ఆధిక్యత దిశగా దూసుకుపోతున్నారు. రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసేసరికి హరీశ్ రావు 13,040 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్ కౌంటింగ్‌లో తన సమీప ప్రత్యర్థిపై 6,338 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, రెండో రౌండ్‌కు వచ్చేసరికి అది రెట్టింపు కావడం గమనార్హం.