సినిమాల్లో పొగత్రాగరాదు : సెన్సార్‌

SMTV Desk 2017-07-25 17:18:50  mumbai, sigarette, sensor, cinemaa, staar heros, smoking

ముంబై, జూలై 25 : సినిమా మొదలయ్యే ముందు ‘ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అని డిస్‌క్లైమర్‌ వేస్తే సరిపోదని నిజంగా ప్రజల మేలు కోరేవారే అయితే సినిమాల్లో హీరోలు సిగరెట్లు, మద్యం తాగడం చూపించకూడదని సెన్సార్‌ బోర్డు చీఫ్‌ పహ్లజ్‌ నిహ్లానీ ఆదేశించారు. ఇదివరకే "అమర్త్యసేన్‌" చిత్రంలో "ఆవు", "గుజరాత్‌" అన్న పదాలు వాడకూడదని చెప్పి వార్తల్లోకెక్కారు నిహ్లానీ. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... "స్టార్‌ హీరోలకు కోట్లల్లో అభిమానులు ఉంటారు. ఆ సినిమాల్లో తమ అభిమాన హీరోలు ఏం చేస్తే అలాగే చేయాలని అనుకుంటారు. అప్పుడు హీరోలు సిగరెట్‌, మద్యం తాగడం చూపిస్తే దానిని పాటించే అభిమానులూ కూడా ఉన్నారు కాబట్టి ఇకనుంచి సినిమాలో మద్యం తాగడం చూపించాల్సిందే అన్నప్పుడు వాటికి ‘ఏ’ సర్టిఫికెట్‌ ఇస్తాం" అంటూ వెల్లడించారు.