హైటెక్ సిటీ వైపు మెట్రో పరుగులు

SMTV Desk 2018-12-06 17:19:20  Hitech City, Metro,

హైదరాబాద్, డిసెంబర్ 06: మరో ఇరవై రోజుల్లో మెట్రోరైలు అధికారికంగా హైటెక్‌సిటీ వరకు రాకపోకలు సాగించనుంది అని సమాచారం అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు 10 కిలోమీటర్ల మార్గంలో ట్రయల్స్‌ మెట్రోరైలు కొనసాగిస్తున్నది. కారిడార్‌-3లో పెండింగ్‌ ఉన్న అమీర్‌పేట-హైటెక్‌సిటీల మధ్య మార్గం ప్రారంభమైతే నాగోల్‌ నుంచి హైటెక్‌ సిటీవరకు నిరంతరాయంగా ప్రయాణించవచ్చు.

సిబిటిసి టెక్నాలజి విధానం ఇప్పటికే ఈ కారిడార్‌ నాగోల్‌ నుంచి అమీర్‌పేట వరకు విజయవంతంగా అమలవుతున్నందువల్ల అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు సేఫ్టీ సర్టిఫికేట్‌ అతి త్వరగా వచ్చే అవకాశముంది. సిగ్నలింగ్‌ సిస్టమ్స్‌ సిబిటిసి విధానం ట్విన్‌ సింగిల్‌ లైన్‌ విధానంలో పకడ్భందీగా పనిచేస్తుంది. హైటెక్‌ వరకు ఉన్న మార్గంలో 8 స్టేషన్లు ఉన్నాయి. మధురానగర్‌, యూసుఫ్‌ గూడ, జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌-5, జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌, పెద్దమ్మగుడి, మాదాపూర్‌, దుర్గంచెరువు, హైటెక్‌