తెరాసపై లగడపాటి సంచలన వ్యాఖ్యలు.!

SMTV Desk 2018-12-05 11:51:02  KTR, Lagadapati Rajagopal

హైదరాబాద్, డిసెంబర్ 5: ఈరోజు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ నేను ఎవరి వత్తిడితో సర్వేలు మార్చలేద్దన్నారు. సెప్టెంబర్ 15 లేదా 16 తేదీలో మా సమీప బంధువుల ఇంట్లో కేటీఆర్ గారు నన్ను కలిశారు. ఆయన నన్ను సర్వేలు టీఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చాయి అంటగా అని అడిగితే, మా బృందం తెలంగాణ ఎన్నికల గురించి సర్వేలు నిర్వహించింది తెరాస కి అనుకూలంగానే ఫలితాలు వచ్చాయి, అవి మీకు కావాలి అంటే మీ ఇ-మెయిల్ అడ్రెస్ ఇవ్వండి మీకు పంపుతాను అని చెప్పాను. మరుసటి రోజు ఆ సర్వే ఫలితాలు ఆయనకి పంపడం జరిగింది.

ఆ సర్వేలు నిర్వహించింది మహాకూటమి ఏర్పడకముందు, ఇప్పుడు ఫలితాలు మారాయి. ప్రజా వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను నిలబెట్టి పలువురు ఇంటిపెండెంట్ అభ్యర్థులు గెలిచే పరిస్థితిని అన్ని ప్రధాన పార్టీలు తీసుకొచ్చాయని వ్యాఖ్యానించారు. అంతేగాని నేను ఎవరి వత్తిడి వలనగాని,భయం వలనగాని సర్వేలు మార్చలేదు అన్నారు.