హైదరాబాద్ ను సర్వనాశనం చేశారు

SMTV Desk 2018-12-02 18:54:42  Hyderabad, KCR, trs manifesto

హైదరాబాద్, డిసెంబర్ 02: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత కల్వకుంట కేసీఆర్ విడుదల చేశారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ప్రజాఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. మేనిఫెస్టో విడుదల అనంతరం, గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న తమ అభ్యర్థులను కేసీఆర్ పరిచయం చేశారు. హైదరాబాద్ నగరాన్ని గత పాలకులు కమర్షియల్ దృష్టితో చూశారని, ప్రజలకు నివాసయోగ్యమైన నగరంగా చూడలేదని విమర్శించారు. అన్ని రంగాల్లోను నగరాన్ని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు . కోటి మంది ఉన్న నగరంలో అధికారిక మార్కెట్లు ఏడు మాత్రమే ఉన్నాయని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే మంచి నిర్ణయం తీసుకోవాలని, గెలవాల్సింది పార్టీలు, అభ్యర్థులు కాదని, ప్రజల అభీష్టమని చెప్పుకొచ్చారు