తెలంగాణ ప్రభుత్వంపై వర్మ విమర్శలు

SMTV Desk 2017-07-25 11:00:12  

హైదరాబాద్, జూలై 25 : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల డ్రగ్స్ వ్యవహారంలో సినీ నటులను చేస్తున్న దర్యాప్తు పై సిట్ అధికారులను లక్ష్యం గా ట్విట్టర్ లో విమర్శించారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ట్విట్టర్ లో... " ఇప్పటి వరకు కేసీఆర్ సమర్ధవంతమైన నాయకుడని ముంబాయి వాసులు అన్నారు. సిట్ అధికారుల విచారణ కారణంగా హైదరాబాద్ తో పాటు తెలంగాణ బ్రాండ్ విలువను కోల్పోయిందని , సినీ ప్రముఖులను సిట్ అధికారులు విచారిస్తున్న తీరుతో తెలంగాణ ప్రతిష్టకే భంగం కలిగిందని ఆయన పేర్కొన్నారు. సిట్ విచారణలో పంజాబ్ కంటే తెలంగాణ అధ్వాన స్థితిలో ఉన్నదని ముంబాయి వాసులు అనుకుంటున్నారని వర్మ తెలిపారు. బాహుబలి సినిమాతో రాజమౌళి తెలుగు రాష్ట్రాల స్థాయిని అమాంతం పెంచితే... ఆ స్థాయిని అకుల్ సబర్వాల్ దిగాజర్చుతున్నారని' వర్మ మండిపడ్డారు.