చంద్రబాబు కనుసన్నల్లోనే కాంగ్రెస్‌ పనిచేస్తుంది

SMTV Desk 2018-11-26 15:44:50  chandrababu, T harish rao,

హైదరాబాద్, నవంబర్ 26: తెలంగాణలో మహాకూటమి విడిపోతుందని టిఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు అన్నారు. కూటమి పార్టీలకే వొకరిపై వొకరికి నమ్మకం లేదని ఆయన ధ్వజమెత్తారు . ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ వంద సీట్లు గెలవడ ఖాయమని అన్నారు. కాంగ్రెస్‌ మైండ్‌గేమ్‌ ఆడుతోందని మండిపడ్డారు. లిక్కర్‌, రియల్‌ ఎస్టేట్ వ్యాపారులకు కాంగ్రెస్‌ టిక్కెట్లు ఇచ్చిందన్నారు. చంద్రబాబు కనుసన్నల్లోనే కాంగ్రెస్‌ పనిచేస్తోందని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.