సుజనాచౌదరి నివాసంలో ఈడీ తనిఖిలు

SMTV Desk 2018-11-24 12:52:58  Sujana choudary, enforcement department

హైదరాబాద్ , నవంబర్ 24: తెలుగు దేశం పార్టీ కి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్స్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ లోని నాగార్జున హిల్స్‌లోగల సుజనాచౌదరికి చెందిన ఇల్లు, ఆయనకుగల రెండు కంపెనీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా… ఈ సోదాలు రెండురోజులపాటు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ సోదాల్లో కంపెనీలకు చెందిన కీలక ప్రతాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తాజా సమాచారం.