నోరు జారిన బాలయ్య వీడియో వైరల్

SMTV Desk 2018-11-18 18:47:53  Nandamuri balakrishna, Harikrishna death, Nandamuri suhasini

హైదరాబాద్, నవంబర్ 18: రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నకల సందర్భంగా రాజకీయ ఆరంగేట్రం చేసిన శ్రీ స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి వారసురాలు సుహాసిని కూకట్ పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె నామినేషన్ వేసేముందు ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి తన తాతను స్మరించుకుంది. తనతో బాబాయ్ నందమూరి బాలకృష్ణ కూడా తోడుగా వెళ్లారు. అదే సమయంలో అక్కడ బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తన అన్న హరికృష్ణ మరణం గురించి నోరు జారాడు. ఆయన మరణం సంబర ఆశ్చర్యంలో ముంచెత్తింది అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ వీడియో నెట్లో వైరల్ అవుతుంది .