మిథాలీరాజ్‌కు బంపరాఫర్

SMTV Desk 2017-07-23 16:37:49  mithali raj, bmw, chamundeshwari nath, womens world cup, sachin tendulkar, andhra cricket assosiation, final

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మాజీ చైర్మన్ చాముండేశ్వరీనాథ్ మిథాలీ రాజ్ కు బంపరాఫర్ ఇచ్చారు. నేడు ఇంగ్లండ్, భారత మహిళా క్రికెట్ జట్ల మధ్య జరిగే ప్రపంచకప్ ఫైనల్ పోరులో గెలిస్తే బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇస్తానని, అంతే కాకుండా ఈ కారును మాస్టర్ సచిన్ చేతుల మీదుగా అందజేస్తామని ఒక మీడియా సమావేశంలో అన్నారు, క్రీడలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే తాను ఈ ఆఫర్ ఇచ్చినట్టు ఆయన తెలిపారు.