సబితా రెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి హంగామా

SMTV Desk 2018-11-15 17:27:26  congeress party sbitha reddy , karthik reddy

హైదరాబాద్ , నవంబర్ 14: శంషాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో హంగామా చేశారు. పార్టీ జెండా దిమ్మెను ధ్వంసం చేసి, అక్కడ వున్న ఫ్లెక్సీలను తీసి తొలగించారు . రాజేంద్రనగర్ టికెట్ ఆశించిన కార్తీక్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.

కాంగ్రెస్ నాయకులకు తాము చెప్పాల్సినదంతా చెప్పాము . కాంగ్రెస్ పార్టీ తనకు బీఫాం ఇవ్వకపోతే రాజీనామాను అంగీకరించినట్టని . ఈ నెల 19వ తేదీ లోపు తనకు బీఫాం ఇవ్వకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతానని ప్రకటించాడు . ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఎవరితో ఓట్లేసి గెలిపించుకుంటారో గెలిపించుకోండంటూ సవాల్ విసిరారు.