టీఆర్ఎస్ ప్రచారానికి నో చెప్పిన ప్రముఖ నటుడు

SMTV Desk 2018-10-30 18:02:11  Allu arjun, TDP, Kancharla chandrashekar reddy

హైదరాబాద్, అక్టోబర్ 30: ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తారంటూ ప్రస్తుతం జోరుగా వార్తొలొస్తున్నాయి. మామ-ప్రముఖ విద్యావేత్త కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి ఆ పార్టీ తరఫున బరిలో దిగే అవకాశాలుండటమే ఇందుకు కారణం. మామ తరఫున ప్రచారానికి ఇప్పటికే సై అన్నాడని కూడా పలువురు చెబుతున్నారు. అయితే ఈ వార్తలన్నీ ఊహాగానాలేనని తెలుస్తోంది. అయితే మామ తరఫున ప్రచారానికి బన్నీ పూర్తి విముఖంగా ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.