తెలంగాణ అభివృద్ధే టీఆర్ఎస్ లక్ష్యం -మాజీ మంత్రి

SMTV Desk 2018-10-29 16:11:08  harishb rao, trs, tdp, chandrababu

మెదక్, అక్టోబర్ 29: తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కె హరీష్ రావు ఎన్నికల సందర్బంగా మెదక్ జిల్లాలోని నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో మాట్లాడుతూ చంద్రబాబు కనుసన్నల్లో ఉత్తమ్‌ పనిచేస్తున్నారని, వొకరిది రెండుకళ్ల సిద్ధాంతం, మరొకరిది కన్నుకొట్టుడు సిద్ధాంతం అని విమర్శించారు.

కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని అన్నారు. అభివృద్ధిని కాంగ్రెస్ వద్దంటోందని, ప్రజలు కాంగ్రెస్‌ను వద్దంటున్నారని అన్నారు. టీఆర్ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని రైతులు నమ్ముతున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధే టీఆర్ఎస్ లక్ష్యం అన్నారు.