రానున్న 48 గంటల్లో ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌!

SMTV Desk 2018-10-13 15:28:12  world wide, internet, Internet Shutdown,

ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇంటర్నెట్‌ వినియోగదారులు రానున్న 48 గంటల్లో నెట్‌వర్క్‌ ఫెయిల్యూర్‌లాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇంటర్నెట్‌కు సంబంధించి పలు కీలక సర్వర్లకు సాధారణ మెయింటనెన్స్‌ చేపట్టనుండటమే ఇందుకు కారణం. ప్రధాన డొమైన్‌ సర్వర్లు, సంబంధిత నెట్‌వర్క్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్లను కొద్దిసేపు నిలిపివేయనున్నట్లు రష్యా నేడు ప్రకటించింది. ఈ కారణంగా ఇంటర్నెట్‌ వినియోగదారులు నెట్‌వర్క్‌ కనెక్షన్‌ ఫెయిల్యూర్స్‌ను ఎదుర్కొనే అవకాశముందని వెల్లడించింది.
‘ది ఇంటర్నెట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ అసైన్డ్‌ నేమ్స్‌ అండ్‌ నంబర్స్’‌(ఐసీఏఎన్‌ఎన్‌) సంస్థ ఈ మెయింటనెన్స్‌ చర్యలను చేపడుతోంది. డొమైన్‌ నేమ్‌ సిస్టమ్‌(డీఎన్‌ఎస్‌)కు మరింత భద్రత కల్పించే చర్యలో భాగంగా దీన్ని చేపడుతున్నట్లు తెలిపింది. పెరుగుతున్న సైబర్‌ దాడులను ఎదుర్కొనేందుకు ఇలాంటి చర్యలు అవసరమని పేర్కొంది. సురక్షితమైన, స్థిరమైన డీఎన్‌ఎస్‌ కోసం ఇలాంటి చర్యలు అవసరమని కమ్యూనికేషన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ(సీఆర్‌ఏ) కూడా ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఈ మార్పు కోసం నెట్‌వర్క్‌ ఆపరేటర్స్‌ లేదా ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను సిద్ధం చేయకపోతే వారిపై దీని ప్రభావం పడొచ్చు. ఏదేమైనప్పటికీ తగిన సిస్టమ్‌ సెక్యూరిటీ ఎక్స్‌టెన్షన్లను ఉపయోగించడం ద్వారా ఈ ప్రభావాన్ని నివారించవచ్చు’ అని సీఆర్‌ఏ తెలిపింది.