కౌశల్ ఆర్మీ హంగామా

SMTV Desk 2018-09-30 12:00:30  Kaushal Army Hungama, Biggboss,

బిగ్‌బాస్ సీజన్2 ఆఖరి అంకానికి చేరింది. ప్రేక్షకుల్లో ఒకటే ఉత్కంఠ. ఎవరు ఈ సీజన్ విన్నర్ అవుతారోనని ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే చివరి ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు అందరూ చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు విన్నర్ ఎవరో తేలిపోనుంది. 18 మంది కంటెస్టెంట్స్, 110 పది రోజులు బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ఇంట్లో అలకలు, కోపాలు, గొడవలు, బుజ్జగింపులు, తిట్టుకోవడాలు, సమర్థించుకోవడాలు, ఆటలు, పాటలు, డాన్సులు, వంటలు, ప్రేమలు, అల్లర్లు…, ఇలా చెప్పుకుంటూపోతే చాలా వున్నాయి ఇంటినిండా. బిగ్‌బాస్ చివరిరోజు ఇవాళ కావడంతో బిగ్‌బాస్ సెట్ దగ్గర కౌశల్ ఆర్మీ శనివారం రాత్రి హంగామా చేసినట్టు తెలుస్తోంది. సుమారు మూడువందల మంది కౌశల్‌ ఆర్మీ సభ్యులు కౌశల్‌.. కౌశల్‌ అని అరుస్తూ హల్‌చల్‌ చేసినట్లు సమాచారం. ఇదంతా న్యూసెన్సుగా భావించిన బిగ్‌బాస్ నిర్వాహకులు బిగ్‌బాస్ ఫైనల్ షూట్‌ను నిలిపివేశారట.