గాంధీ జయంతి సందర్భంగా ‘మణికర్ణిక’ టీజర్‌

SMTV Desk 2018-09-30 10:57:31  gandhi jayanthi, manikarnika, manikarnika teaser

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘మణికర్ణిక’. ఇప్పటికే పలు వివాదాలతో వార్తల్లో ఉంటున్న ఈ సినిమా ఫైనల్‌గా రిలీజ్‌కు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న రిలీజ్‌ చేయనున్నారు. కంగనా రనౌత్‌ ఝాన్సీ లక్ష్మీ బాయ్‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్‌ కథ అందించారు. మేజర్‌ పార్ట్‌కు క్రిష్ దర్శకత్వం వహించగా చివర్లో కొన్ని సన్నివేశాలతో పాటు ప్యాచ్‌ వర్క్‌కు కంగనా దర్శకత్వం వహించారు. ఆ సమయంలో కంగన వ్యవహార శైలిపై ఆరోపణలు వచ్చాయి. అం‍తేకాదు దర్శకురాలిగా కంగనా పేరునే టైటిల్స్‌ లో వేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ అనుమానాలన్నింటికి టీజర్‌తో సమాధానమివ్వనున్నారు చిత్రయూనిట్‌.