ఎన్.టి.ఆర్ తో పోటీగా వచ్చే దమ్ము ఉందా

SMTV Desk 2018-09-29 12:26:41  NTR , Vijay NOTA,

యువ హీరో విజయ్ దేవరకొండ ఆనంద్ శంకర్ డైరక్షన్ లో చేస్తున్న సినిమా నోటా. అక్టోబర్ 5న రిలీజ్ అవుతున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో విజయ్ దేవరకొండ ఓ పోలింగ్ ఏర్పరిచాడు. తన సినిమా రిలీజ్ విషయంలో ఆడియెన్స్ సహాయం తీసుకునేలా అక్టోబర్ 5,11,18, లతో పాటుగా నోటా అంటూ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు. అయితే ఫైనల్ గా అక్టోబర్ 5కే ఆడియెన్స్ అందరు ఓటేయడం తో నోటా సినిమా ఆరోజున రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే ఎన్.టి.ఆర్ అరవింద సమేత అక్టోబర్ 11న వస్తుంది. ఆ డేట్ కూడా తన పోలింగ్ లో పెట్టేసరికి నందమూరి ఫ్యాన్స్ టార్గెట్ అయ్యాడు విజయ్ దేవరకొండ. ఎన్.టి.ఆర్ తో పోటీగా వచ్చే దమ్ము ఉందా అంటూ రకరకాల కామెంట్స్ పెట్టారు. అంతేకాదు నెగటివ్ ట్రోలింగ్స్ చేస్తూ వచ్చారు. వారి కామెంట్స్ కు పర్ఫెక్ట్ రిప్లై ఇచ్చాడు విజయ్ దేవరకొండ. స్టార్ సినిమాకు పోటీగా అంటే అది కష్టమే అని తెలుసు. అంతేకాదు అరవింద సమేత తన సినిమా బడ్జెట్ కు పది రెట్లు ఎక్కువ. అక్టోబర్ 10 నుండి దసరా హాలీడేస్ కాబట్టి రిలీజ్ చేద్దామని అనుకున్నాం అయితే ఎన్.టి.ఆర్ సినిమాకు పోటీగా రిలీజ్ చేయకూడదనే కామన్ సెన్స్ తనకు ఉందని.. కాని ఫ్యాన్స్ ఇలా నెగటివ్ ట్రోల్స్ చేయడం తనకు నచ్చదని అన్నాడు. ఓ సినిమా 100 కోట్లు బిజినెస్ చేస్తే 10 లక్షల మంది వారు చూస్తారని.. అయితే 8 కోట్ల మంది చూడని వారు ఉంటారు. థియేటర్ సమస్యలు కూడా ఉండవని చెప్పుకొచ్చాడు విజయ్.