"నోటా" సెన్సార్ పూర్తి

SMTV Desk 2018-09-29 11:00:33  nota ,vijay devarakonda,

టాలీవుడ్‌ క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ రాజకీయ నేపథ్య కథతో తెరకెక్కుతున్న ‘నోటా’ చిత్రంతో ప్రేక్షకులముందుకు రానున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్‌కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తాజాగా సెన్సార్‌కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అక్టోబర్‌ 5న విడుదల కానున్న ఈ సినిమాకి ‘యూ’ సర్టిఫికేట్‌ లభించింది. సెప్టెంబర్‌ 30న విజయవాడ,అక్టోబర్‌ 1న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్‌. ఇటీవలే గీతగోవిందంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన విజయ్ దేవరకొండ‌.. ‘నోటా’తో మళ్లీ సందడి చేయనున్నాడు. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.