ప్రణయ్ కు మంచు మనోజ్ నివాళి

SMTV Desk 2018-09-17 15:08:21  manchu manoj twitter post , pranay, amrutha

హైదరాబాద్: మిర్యాల గూడ లో జరిగిన ప్రణయ్ హత్యోదంతం పై సినీ నటుడు మంచు మనోజ్ భావోద్వేగంతో స్పందించారు, "మానవత్వం కంటే కులం, మతమే ఎక్కువని భావించే వారికే ఈ లేఖ" అంటూ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు, ఏ రంగం లో ఉన్న వారైనా సరే మనుషులకన్నా కులాన్ని ప్రేమించడం అనేది చాలా దారుణమైన విషయం కులాలను మతాలను ప్రేమించే ప్రతి ఒక్కరు ఈ దరుణానికి భాద్యులని, మనిషి జీవితం కంటే మరేదీ ఎక్కువ కాదనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం అని, కుల ప్రేమికులను, మద్దతుదారులను చూసి సిగ్గుపడుతున్నాఅని అన్నారు, అమృత పరిస్థితి తనను ఎంతగానో కలచి వేసిందని, తండ్రిని స్పర్శించక ముందే.. బిడ్డకు తండ్రే లేకుండా చేశారు, ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరాలి, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని లేఖ లో పేర్కొన్నారు. మరోవైపు నటి పూనం కుర్ కూడా ఘటనపై దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు "ప్రజలంతా ప్రేమకు వ్యతిరేకంగా ఎందుకున్నారు? ఇలాంటి పనుల ద్వారా ఏం సాధిస్తారు? అమృత-ప్రణయ్ జంటకు న్యాయం జరిగేది ఎప్పుడు? మనం నిజంగానే 21వ శతాబ్దంలో ఉన్నామా? ప్రణయ్ హత్య, అమృత రోదన నా మనసును కలచివేస్తోంది" అని ట్వీట్ చేశారు.