తెలంగాణ లో 30 లక్షల నకిలీ ఓట్లున్నాయి -మర్రి శశిధర్ రెడ్డి

SMTV Desk 2018-09-15 10:21:58  telangana voters, congress, marri shashidhar reddy,CDAK

హైదరాబాద్ : శుక్రవారం ఢిల్లీ లో మాట్లాడిన కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఓటరు జాబితా మొత్తం లో 12 శాతం నకిలీ ఓట్లు ఉన్నాయని ఇది సామాన్యమయిన విషయం కాదని, ఒక్క తెలంగాణ రాష్ట్రం లోనే 30 లక్షల మందికి నకిలీ ఓట్లు ఉన్నాయని మరియు 18 లక్షల మందికి ఏపి, తెలంగాణ రాష్ట్రాలలో రెండు సార్లు ఓటు నమోదు చేయించారని వెల్లడించారు. ఈ విషయాన్ని సీఈసీ దృష్టికి కూడా తీసుకెల్లామని అన్నారు, సీడాక్ ద్వారా సమస్య పరిష్కారానికి ఈసీ కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు