టీడీపీకి తెలంగాణలో ఓటు బ్యాంకు లేదు : కోమటిరెడ్డి

SMTV Desk 2018-09-13 16:56:39  Komatireddy Venkat reddy, congress, Rahul gandhi, TDP, Telangana,

హైదరాబాద్ : తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఖచ్చితంగా విజయం సాదిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణాలో ఓటు బ్యాంకు లేని టీడీపీతో పొత్తు అవసరం లేదని తెలిపారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఈ పొత్తు గురించి వివరిస్తానని అన్నారు. మహా కూటమిలో విపక్షాలకు 10 సీట్లకె పరిమితం చేయాలని అన్నారు. దక్షణ తెలంగాణాలో తెరాసకు ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలు ఎందుకు వెళ్తున్నారో ఇప్పటికీ చెప్పలేకపోతున్నారని అయన వ్యాఖ్యానించారు.