గట్టయ్య ఆరోగ్య పరిస్థితి విషమం

SMTV Desk 2018-09-13 11:42:40  Balka Suman mp, Nallala Odelu MLA, TRS, Telangana Elections

హైదరాబాద్ : తెరాస నేత బాల్కసుమన్ కు చెన్నూర్ అసెంబ్లీ టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు అనుచరుడు గట్టయ్య ఆత్మహత్యయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పెట్రోల్ పోసి నిప్పంటించుకున్న గట్టయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గట్టయ్యతో పాటు మంటలు అంటుకున్న మరో ఐదుగురి పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. వీరంతా హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు పరామర్శించారు.