అస్సాం వరదలకు మెగా హీరో సాయం

SMTV Desk 2017-07-18 15:10:13  Mega Hero, ram charan, help, Assam, floods

హైదరాబాద్, జూలై 18 : ఈశాన్య ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అస్సాం రాష్ట్రం మొత్తం జలమయమయ్యాయి. వరద నీటితో నగరాలు, గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ వర్షాల వల్ల జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరదల కారణంగా అస్సాంలో ఇప్పటికే చాలా మంది చనిపోయారని సమాచారం. కజిరం జాతీయ పార్కులో భారీగా వరద నీరు చేరటంతో వన్య మృగాలు మునిగిపోతున్నాయి. వాటి సహాయం కోసం ఆన్ లైన్ ఫండ్స్ కలెక్ట్ చేస్తున్న సామాజిక కార్యకర్త వివరాలను మెగా హీరో రామ్ చరణ్ తన ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసారు. అస్సాంలో వరద బాధితులకు తమ వంతు సహాయం చేయమని రామ్ చరణ్ అభిమానులను కోరారు. ' మీరు ఇచ్చే ప్రతి రూపాయి అస్సాం ని తన కాళ్ల మీద నిలబడేలా చేస్తుంది.' అని రామ్ చరణ్ ఫేస్ బుక్ ద్వారా తెలిపారు. మరో వైపు ఆన్ లైన్ ఫండ్స్ ద్వారా సామాజిక కార్యకర్త సిమ్రాన్ కు రూ. 2 లక్షలు సహాయం అందించారని తెలిసింది.