ప్రతిపక్షాల పై మండిపడ్డ సీఎం కేసీఆర్

SMTV Desk 2017-05-30 15:09:53  kcr,fir on poltical parties, ratode ramesh,pidepalli ravinder rao

హైదరాబాద్, మే 30 : టిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా జరుగుతున్నఅభివృద్ది, సంక్షేమం చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు బట్టలు చించుకుంటున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రతిపక్షాలను ఎద్దేవా చేశారు. రాష్ట్ర పురోగతిని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేని పరిస్థితి... అధికారం చేజిక్కించుకోలేమన్న బెంగ, ఆందోళనలు రోజురోజుకు పెరిగిపోయి విచిత్రంగా వ్యవహరిస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపి రమేశ్ రాథోడ్,కాంగ్రెస్ నాయకులు పైడిపల్లి రవీందర్ రావులు ముఖ్యమంత్రి కేసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు తమ సర్వే బోగస్ సర్వే అంటు నోటికోచ్చినట్లు మాట్లాడుతున్నారని...బోగస్ సర్వే అంటున్న వారి దమాక్ లే బోగస్ వని విరుచుకపడ్డారు. తమను రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటి చేయాలని కాంగ్రెస్ వారు డిమాండ్ చేస్తున్నారని...మీపై మీకు నమ్మకముంటే రాజీనామా చేయండి ..ఎన్నికలకు పోదాం..మీరు గెలుస్తారో మెము గెలుస్తామో తేటతెల్లం అవు తుందని సవాలు విసిరారు. ప్రజల్లో టిఆర్ఎస్ పై విశ్వాసం పోయిందనుకుంటే మీరే రాజీనామా చేయాలే...మెమేందుకు రాజీనామా చేయాలే..చేసి చేసి అలసి పోయినం.. మా రాజీనామాలు తెలంగాణ కోసమై విసిరిపా రేశాం ..నేను ఐదుసార్లు రాజీనామా చేశా..తెలంగాణా ఉద్యమం పుట్టినప్పటి నుండి డిప్యూటి స్పీకర్, ఎంఎల్ ఎ, ఎంపి, కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేశా, రాష్ట్రంలో ఆరుగురు మంత్రులతో రాజీనామా చేశామని ..గిప్పుడు మీకు పౌరుషం గనుక ఉంటే రాజీనామాలు చేయండని సవాలు విసిరారు. టిఆర్ఎస్ సర్వేలు బోగస్ అంటూ కాంగ్రెస్,బిజెపి,టిడిపి లు చేసిన విమర్శలను తిప్పికొడుతు దేశంలో బిజెపి కి 39 శాతం ఓటింగ్ ఉందని, ఇప్పుడు కొత్త సర్వే ప్రకారం 46 శాతం ఓటింగ్ ఉందంటున్నారని ..కేంద్రమంత్రి దత్తాత్రేయ మా సర్వే తప్పు అంటున్నారు..మా సర్వే బోగస్ అయితే మీది కుడా బోగస్ సర్వే అన్నట్లే కదా అని ప్రశ్నించారు. విద్యుత్ కోసం కాంగ్రెస్, టిడిపీలు 30 ఏళ్ళు రైతులను వేదనకు గురిచేశారు...మేం ఆరునెలల్లో సరిచేశాం. దేశం మెుత్తంలో ఎవరూ ఇవ్వని రీతిన నాణ్యమైన విద్యుత్ ను ఇచ్చాం..పవర్ కట్ లేదు..మోటార్ల కాలుడు లేదు..ట్రాన్స్ ఫార్మర్ల పేలుడు లేదని వివరించారు.