అనుమతి లేకుండా ఏ పనీ చేయను

SMTV Desk 2018-09-10 12:35:05  Samantha, Naga Chaitanya,

సమంత కథానాయికగా నటిస్తున్న యూ-టర్న్ మూవీ ఈ నెల 13 న విడుదల కాబోతుంది . ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. ఈ సందర్బంగా తన భర్త గురించి ఈ విధంగా చెప్పుకొచ్చింది . తన భర్త, హీరో చైతన్య విషయంలో మాత్రం అతని అనుమతి లేకుండా ఏ పనీ చేయనంటోంది. సోషల్‌ మీడియాలో చైతూకి సంబంధించి వీడియో అయినా ఫొటో అయినా పెట్టాలంటే ముందు అతని అనుమతి కోరతానని చెబుతోందీ ఈ అందాల భామ తనతోపాటు చైతన్య చిత్రాల విషయాలే కాదు వ్యక్తిగత విషయాలను కూడా సామ్‌ అప్పుడప్పుడూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.