నేడు భారత్ బంద్

SMTV Desk 2018-09-10 10:54:12  Bharat Bundh, Petrol diesel rates hiked,

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు సోమవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో ఆందోళనకారులు ఈరోజు తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ బస్సు డిపోల వద్దకు చేరుకొని బస్సులను బయటకు రాకుండా అడ్డుకోవడంతో అనేక చోట్ల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కాంగ్రెస్‌, సిపిఐ, సిపిఎం, తెలంగాణా జనసమితి, జనసేన తదితరపార్టీలు, ప్రజా సంఘాలు ఈ బంద్ కు మద్దతు ఇస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాలలో ఆర్టీసీ బస్సులు, ఆటోలు యధావిధిగా తిరుగుతుండటంతో బంద్ ప్రభావం అంతగా కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ బంద్ కు పిలుపు ఇచ్చినందున రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్‌ కార్యర్తలు బంద్ ను విజయవంతం చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రెండు రాష్ట్రాలలో ప్రధాన ప్రాంతాలలో విద్యా, వ్యాపార, వాణిజ్య సముదాయాలను ఆందోళనకారులు బలవంతంగా మూయించివేస్తున్నారు.