కేటీఆర్ టికెట్ రాకుండా ఆపారు

SMTV Desk 2018-09-08 12:29:41  Konda Surekha, Wararngal , TRS

* మహిళలు పాత్ర లేనిదే తెలంగాణ వచ్చిందా. * అసెంబ్లీ రద్దు నిర్ణయం సరైంది కాదు. * మీడియా సమావేశంలో కొండా సురేఖ. హైదరాబాద్ : కేసీఆర్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటినుండి ఆ పార్టీలో అసమ్మతి సెగ మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో పేర్లు ప్రకటించని వారు తిరుగుబాటు చేస్తున్నారు. వరంగల్ తూర్పు నుండి కొండా సురేఖకు తెరాస టికెట్ ఇవ్వకపోవడంతో వారు చేసిన తప్పేంటని ప్రశ్నించారు. ఈ సందర్బంగా శనివారం సోమాజికగూడ ప్రెస్‌క్లబ్‌లో కొండా సురేఖ దంపతులు మీడియాతో మాట్లాడారు. వరంగల్ తూర్పు నియోజవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచిన తనను ఆ జాబితాలో ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. బీసీ మహిళనైన తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. 105 మంది జాబితాలో తన పేరు ప్రకటించకపోవడానికి కారణాలేంటని ఆమె ప్రశ్నించారు. గత ఎన్నికల సమయంలో చాలాసార్లు తమకు వర్తమానం పంపారని...అయితే పరకాల సీటు ఇస్తేనే టీఆర్‌ఎస్‌లోకి వస్తామని తాము తెల్చిచెప్పామని అన్నారు. అందుకు కేసీఆర్ అంగీకరిస్తూ తనకు మంత్రి పదవి, కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారని ఆమె గుర్తుచేశారు. మహిళల పాత్ర లేనిదే తెలంగాణ వచ్చిందా అని ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికల కొరకు అసెంబ్లీ రద్దు నిర్ణయం సరైంది నిర్ణయం కాదని అన్నారు. మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేసారు.