శ్రీకాంత చారి కంటే గొప్ప త్యాగం చేసావా ?

SMTV Desk 2018-09-07 17:07:11  Shankarmma, TRS

* అమరవీరులకు గుర్తింపేది. * శంకరమ్మకు తెరాస టికెట్ ఇవ్వాలంటూ టవర్ ఎక్కిన ఇద్దరు యువకులు. హైదరాబాద్:ప్రత్యేక తెలంగాణ కొరకు ఎందరో విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. శ్రీకాంత చారి తల్లి శంకరమ్మకు గతంలో తెరాస టికెట్ ఇచ్చింది. కానీ అక్కడ ఆమె గెలవలేదు. ఈ సారి కూడా టికెట్ ఇవ్వాలని గతంలో ఆమె మీడియా ముందు వెల్లడించింది. నిన్న ప్రకటించిన తెరాస అభ్యర్థుల జాబితాలో శంకరమ్మ పేరు లేదు. దీంతో ఆవేదన చెందిన ఇద్దరు యువకులు ఎల్బీనగర్ లోని చింతల్ కుంటలో ఉన్న రేడియో టవర్ ను ఎక్కారు. శంకరమ్మకు టికెట్ ఇస్తేనే కిందకు దిగుతామని స్పష్టం చేశారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు గంటల నుంచి ఇద్దరు యువకులు రేడియో టవర్ పైనే ఉండటంతో ఇక్కడ స్థానికులు భారీగా గుమిగూడారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ను 2003, నవంబర్ 29న అరెస్ట్ చేయడంతో నల్గొండ జిల్లాకు చెందిన శ్రీకాంతాచారి డిసెంబర్ 3న ఎల్బీనగర్ చౌరాస్తాలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో వారికీ సరైన గుర్తింపు లేదని శంకరమ్మ ఇదివరకు మీడియా సమావేశంలో వెల్లడించారు.