ఆస్పత్రిలో చేరిన ప్రముఖ బాలీవుడ్ నటుడు

SMTV Desk 2018-09-05 20:33:35  Dilip kumar, Bollywood Actor,

అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ (95) మరోసారి ఆస్పత్రిలో చేరారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ రావడంతో ఆయనను.. కుటుంబసభ్యులు ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చారు. కాగా ఈ విషయాన్ని దిలీప్ కుమార్ స్నేహితుడు ఫైసల్ ఫరూఖీ వెల్లడించారు. దిలీప్ కుమార్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిపారు