టీడీపీ గెలుపు చారిత్రక అవసరం

SMTV Desk 2018-09-05 12:03:17  tdp party, historic win, chandrababu

* వైసీపీతో బీజేపీ రహస్య ఒప్పందం * వారిని ఓడించి బుద్ది చెప్పాలి * ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి : వచ్చే ఎన్నికల్లో వైసీపీ, బీజీపీ పొత్తుకు సిద్దమయ్యాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. రాష్ట్రంలోకి దొడ్డి దారిన ప్రవేశించేందుకు బీజేపీ యత్నిస్తోందని... వైసీపీ, జనసేన పార్టీలే ఆ దొడ్డి దారులు అని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న టీడీపీకి అండగా నిలవాలని అన్నారు. రాష్ట్రాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఏపీకి ఒక చారిత్రక అవసరమని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో అయన మాట్లాడారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీ అవిశ్వాస తీర్మానం పెడితే... ఏకంగా 126 మంది ఎంపీలు మద్దతు ప్రకటిస్తే వైసీపీ ఎంపీలు పారిపోయారని అన్నారు.