ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ

SMTV Desk 2018-09-02 16:46:15  Telangana Cabinet, KCr, KTR

తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రగతి నివేదన సభకు ముందు జరగనున్న కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకుంటారని జోరుగా చర్చ సాగింది.అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలపై ఊహించని నిర్ణయం తీసుకుంటారని భావించారు. కానీ అలాంటి అంశాలు లేకుండానే కేబినెట్ భేటీ ముగిసింది. దీంతో సభలో ఏం చెప్తారనే ఉత్కంఠ ఉంది.కేవలం ప్రభుత్వపరంగా తీసుకున్న నిర్ణయాలతోనే సరిపెట్టారు. మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్ రావు కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు. గోపాలమిత్రుల వేతనాన్ని రూ. 3500- రూ. 8500 పెంచారు. అర్చకుల రిటైర్మెంట్ ఏజ్ ను 58-65 ఏళ్లకు పెంచారు. ఆశావర్కర్ల వేతనం 6 వేల -7500 కు పెంచారు. ఇక 50 శాతం పైబడిన బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల కోసం 71 ఎకరాల భూమి కేటాయించడమే గాక భవనాల నిర్మాణం కోసం రూ. 70 కోట్లు కేటాయించినట్లు మంత్రులు చెప్పారు.