మహిళా ఉద్యోగులకు తీపి కబురు

SMTV Desk 2018-09-01 18:22:32  KCR, telangana CM,

మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇకపై ఏడాదికి 5 రోజులు ప్రత్యేక సాధారణ సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెలవులకు సంబంధించిన ఫైల్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. ఇప్పటికే మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం ప్రసూతి సెలవు సౌకర్యం కల్పించింది. గర్భం సమయంలో 180 రోజులు సెలవులు తీసుకోవచ్చు. పర్మినెంట్‌ ఉద్యో గులకు వేతనంతో కూడిన సెలవులను ఇస్తారు. దీనిని డ్యూటీగానే పరిగణించి సర్వీస్‌ను కొనసాగిస్తారు. గర్భిణి 8వ నెల నుంచి ఎప్పుడైనా 180 రోజులు ఉపయోగించుకోవచ్చు. మొదటి, రెండో కాన్పులకు మాత్రమే ప్రసూతి సెలవులు ఇస్తారు. ఒకటి, రెండు కాన్పుల్లో పిల్లలు చనిపోతే మూడో కాన్పులో సెలవులకు అవకాశం ఇస్తారు. కాన్పునకు ముందుగాని... తరువాత గాని ఉద్యోగికి ఉండే అర్హత సెలవులు (సహజ సెలవులు) ఉపయోగించుకోవచ్చు.